మనం రీరిలీజ్‌ షోకు హాజరైన నాగచైతన్య.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫ్యాన్స్ గోల, చైతూ ఏం చేశాడంటే?

సమంత, అక్కినేని ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన సినిమా మనం. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరా ముఖ్యంగా ఇందులో నాగచైతన్య

Update: 2024-05-24 01:58 GMT

దిశ, సినిమా : సమంత, అక్కినేని ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన సినిమా మనం. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరా ముఖ్యంగా ఇందులో నాగచైతన్య, సమంత మధ్య కెమిస్ట్రీ వావ్ అనేలా ఉంటుంది. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా థియేటర్స్‌లో చైతూ, సామ్‌ను చూసే ఛాన్స్ వచ్చింనే చెప్పాలి.

ఇక డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో పునర్జన్మల ప్రేమను మిక్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇందులో అక్కినేని నాగేశ్వర్ రావు, నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, సమంత, శ్రియ కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈమూవీ నేటికి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సినిమాను రీరిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను తమ అభిమానులతో వీక్షించడానికి అక్కినేని నాగచైతన్య, థియేటర్‌లో స్పెషల్ షోకు హాజరయ్యారు. దీంతో చైతూ అభిమానులు, డైరెక్టర్ విక్రమ్‌తో కలిసి సినిమాను చూశారు. ఇక ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌ కావడంతో అభిమానుల గోల మాములుగా లేదు. నాగచైతన్య, సమంత సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్స్ సందడిగా గోల గోలగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా వీరి మధ్య కెమిస్ట్రీ సీన్, పెళ్లి సీన్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ స్క్రీన్ దగ్గరకు వెళ్లి మరి హంగామా చేశారు. మరీ ముఖ్యంగా సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ముందే ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. పెళ్లి సీన్ కి ఫ్యాన్స్ హంగామా చేస్తుండడంతో చైతు వారిని కూర్చోమని చెబుతూ చిరాకు పడ్డ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Similar News