నా ఫేవరేట్ డ్యాన్సింగ్ పార్ట్నర్.. కూతురితో డాన్స్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్ వీడియో వైరల్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ అందరికీ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’ మూవీలో నటించిన రేణుదేశాయ్ ఈ సినిమా తర్వాత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Update: 2024-04-28 08:14 GMT

దిశ,సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ అందరికీ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’ మూవీలో నటించిన రేణుదేశాయ్ ఈ సినిమా తర్వాత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు కూడా. వీరికి అకీరా నందన్‌, ఆద్య పిల్లలు ఉన్నారని అందరికి తెలిసిన విషయమే. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆద్యతో డాన్స్ చేస్తున్న వీడియోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా ఫేవరేట్ డ్యాన్సింగ్ పార్ట్నర్. మన ఫేవరెట్ పర్సన్ తో డాన్స్ చేస్తే థెరపీల పనిచేస్తుంది అని పోస్ట్ చేసింది. అయితే వీడియోలో మొదట ఆద్య ఫేస్ చూపించకుండా తను డాన్స్ చేస్తూ ఆ తర్వాత ఆద్య ఫేస్ రివీల్ చేసింది.

దీంతో పవన్ అభిమానులు రేణు దేశాయ్, ఆద్య డాన్స్ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఆద్య బాగా డాన్స్ చేస్తుంది ని కామెంట్ చేస్తున్నారు. తల్లీకూతుళ్లు డాన్స్ చేస్తున్న వీడియోను మీరు కూడా ఓ లుక్ వేయండి.

Similar News