నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా ‘దేవర’ టైటిల్‌ను కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘ఎన్టీఆర్-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతున్న చిత్రంలో నటిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘ఎన్టీఆర్-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా.. ఇందులో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో నిన్ననే ఎన్టీఆర్-30 నుంచి ఫస్ట్ లుక్, పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఓ పోస్టర్ విడుదలైంది. తాజాగా, దీనిపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘దేవర టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న. నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023