మాజీ భర్తకు స్పెషల్ ఇన్విటేషన్ పంపిన మెగా డాటర్ నిహారిక.. వైరల్ అవుతున్న కార్డ్

మెగా డాటర్ నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా జరిగింది.

Update: 2024-05-27 10:55 GMT

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు తరలివెళ్లారు. కానీ ఈ కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. చైతూతో విడాకులు తీసుకుని పుట్టింటికి చేరింది నిహారిక. దీంతో ఆమెపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. కనీసం రోజుకు ఒకరైనా ఆమె కామెంట్స్ సెక్షన్‌లో బూతులు రాస్తూనే ఉంటారు. అయినా పట్టించుకోని నిహారిక తాజాగా స్పందించింది. ఓ కార్డ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది.

మిత్రులు, శత్రువులు, సక్సెస్, ఫెయిల్యూర్, పర్సనల్, ప్రొఫెషనల్.. ఇలా అన్నింటి గురించి మెన్షన్ చేసిన కార్డ్ మంచి మేసేజ్ ఇస్తుంది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. మాజీ భర్తకు స్పెషల్ ఇన్విటేషన్ పంపింది అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు. ఇంకొందరు విమర్శకులకు ఇలా బుద్ధి చెప్పిందని అభిప్రాయ పడుతున్నారు. ఇక నిహారిక ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టింది. ఇటు ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అవుతూనే అటు హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో మంచు మనోజ్ సినిమాకు ఓకే చెప్పిన బ్యూటీ.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఓ మూవీ చేస్తుంది.

Read More...

గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్న టీవీ యాంకర్.. భార్య ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే 

Tags:    

Similar News