సీనియర్ హీరో వెంకటేష్‌కు సరసన నటించడానికి రెడీ అయిన మహేశ్ బాబు మరదలు!

ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో రవితేజ ఖిలాడీ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇక ఈ సినిమా

Update: 2024-05-22 09:47 GMT

దిశ, సినిమా : ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో రవితేజ ఖిలాడీ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు వస్తున్నాయి.

మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్‌కు మరదలి క్యారెక్టర్‌లో చేసి ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ డీజాస్టర్‌గా మిగిలినప్పటికీ అమ్మడు యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ సీనియర్ హీరో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా చెయడానికి రెడీ అయ్యిందంట. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఏమీ లేదు. ఇక ఈ నటి ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా గడుపుతోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే అవకాశం దక్కించుకుంది. విశ్వంభర మూవీలో చిరుకు చెల్లి పాత్రలో కనిపించబోతుందంట. అంతే కాకుండా తెలుగులో వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. అలా విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్‌తో కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఈ ఆఫర్ కూడా రావడం ఈ ముద్దుగుమ్మకు అదృష్టమనే చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమాలతో ఈ హాట్ బ్యూటీ స్టార్ హోదా అందుకుంటుందో లేదా ప్లాప్స్‌తో వెనకడుగు వేస్తుందో అంటున్నారు తమ అభిమానులు.

Read More..

గుడ్ న్యూస్ చెబుతానంటూ జ్యోతి రాయ్ పోస్ట్.. 38 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతుందా? 

Tags:    

Similar News