ప్రోగ్రామ్ కోసం వెళ్తే మీనా నాతో అలా చేసింది.. స్టార్ ప్రొడ్యూసర్ ఆవేదన

అలనాటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-05-27 10:08 GMT

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మీనా ఒక పక్క సినిమాలు, షోస్ తో బిజీగా మారింది.ఇదిలా ఉండగా తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్.. మీనా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

“మీనా అప్పుడు స్టార్ స్టేటస్ లో ఉంది. ఆమెతో ఒక ప్రోగ్రాం చేయిద్దామని.. ఆమెను అడగడానికి ఇంటికి వెళ్లాను. మీనా, ఆమెతో పాటు ఆమె తల్లి కూడా దురుసుగా మాట్లాడింది. నేను ఒక నిర్మాతను.. నాలాంటి వాళ్ళే వారికి సినిమాలు ఇచ్చేది. అలాంటిది.. నాతో వారు చీప్ గా మాట్లాడతారా.. ? చాలా బాధగా అనిపించింది. ఆ టైమ్ లోనే ఏది ఇంకా ఎవరిని ఏమి అడగకూడదని అనుకున్నాను. ఇండస్ట్రీలో నాకు చాలామంది హీరోయిన్స్ ఇప్పటికీ స్నేహంగా మెలుగుతారు. సుహాసిని,రోజా, ఖుష్బూ.. ఇలా వీరందరూ మంచిగా మాట్లాడతారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నిర్మాత మాటలు విన్న అభిమానులు.. ఏంటి మీనా మరి ఇలా మాట్లాడుతుందా.. ? ఆమె చాలా మంచిది అనుకున్నామే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Similar News