మూడుసార్లు పెళ్లి జరిగింది.. తరుణ్ జీవితంలో ఆ రహస్యాలను బయటపెట్టిన రోజా!

టాలీవుడ్ హీరో తరుణ్ నటి రోజా రమణి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

Update: 2024-05-03 05:31 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో తరుణ్ నటి రోజా రమణి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తల్లి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో కొనసాగాడు. ఆ తర్వాత నువ్వే కావాలి మూవీతో హీరోగా అందరి ముందుకు వచ్చాడు. సోగ్గాడు, నవ వసంతం, ఎలా చెప్పను, నువ్వే నువ్వే వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ తరుణ్ కుమార్ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఆయన పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించకుండా.. సోషల్ మీడియాకు అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు. దానికి కారణాలు తెలియనప్పటికీ ఆయన పెళ్లి వార్తలపై తరుణ్ తల్లి నటి రోజా రమణి ఇప్పటికే చాలాసార్లు స్పందించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి తరుణ్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘రూమర్స్ అనే పదం లోనే ఉంది కదా అవి నిజం కావని. అందుకే వాటిని పట్టించుకోవద్దు. సీరియస్‌గా అస్సలే తీసుకోవద్దు. నవ్వుకుని వాటిని వదిలేయాలి. చెప్పుకోనివ్వండి.. మాట్లాడుకోనివ్వండి.. అలా చేస్తే వారికి వచ్చేది ఏం లేదు. ఇక తరుణ్ సినిమాల్లో చేసుకున్న పెళ్లిళ్ల కంటే బయటనే ఎక్కువ అవుతాయి.

అలా తరుణ్‌కు ఇప్పటికి మూడుసార్లు పెళ్లి జరిగిపోయింది. ఎవరిదో ఫొటో తీసుకుని, దానికి వేరే తల పెట్టడమో లేదంటే ముఖాలు బ్లర్ చేయడం వంటివి చేసి పెట్టేస్తుంటారు. ఆ ఫొటో తాలూకు హీరోయిన్లు నాకు ఫోన్లు చేసి ఆంటీ ఫొటో చూశారా? పెళ్లి చేశారు అని చెప్తుంటారు. అయితే శ్రేమ, త్రిష, ప్రియమణి వాళ్లంతా చాలా క్లోజ్‌గా ఉంటారు కాబట్టి నాకు ఫోన్ చేసి ఆగ పట్టిస్తుంటారు. వాటిని నేను కూడా సీరియస్‌గా తీసుకోను. తల్లిగా తరుణ్ పెళ్లి చేయడం నా బాధ్యత. కానీ వాడికి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేస్తాను. అది లవ్ మ్యారేజా? ఆరెంజ్ మ్యారేజా అనేది వాడి చేతిలోనే ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు 41 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి ఏదో కారణం ఉందంటూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News