బ్యాన్ లేదా బాయ్‌కాట్.. మాకు చాలా మేలు చేస్తాయి

సినీ పరిశ్రమలో నిషేధం లేదా బహిష్కరణ సంస్కృతి గురించి నటుడు మనోజ్ బాజ్‌పేయి తన అభిప్రాయం వెల్లడించాడు.

Update: 2023-05-12 09:48 GMT

దిశ, సినిమా : సినీ పరిశ్రమలో నిషేధం లేదా బహిష్కరణ సంస్కృతి గురించి నటుడు మనోజ్ బాజ్‌పేయి తన అభిప్రాయం వెల్లడించాడు. ఈ మేరకు నటీనటులు, సినిమాలను బ్యాన్ లేదా బాయ్‌కాట్ చేయడం వల్ల జనాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, దానికి బదులు తామే ప్రయోజనం పొందుతామని చెప్పాడు. ‘మమ్మల్ని నిషేధించడం ద్వారా ఎవరికీ ఏ రకమైన మైలేజీ లభించదు. వాళ్లు చేసే ప్రచారం వల్ల మాకు మరింత పబ్లిసిటీ వస్తుంది. పాపులారిటీ పొందుతాం’ అని చెప్పాడు. ఇక తన వ్యక్తిగతం విషయం గురించి చెబుతూ.. ‘ప్రజలు నన్ను నిజంగా లవ్ చేస్తారు. నేను ఊహించనంతగా ప్రేమించబడ్డాను. వాళల్లో విశ్వసనీయతను సృష్టించగలిగాను. అయితే దీనికి చాలా సంవత్సరాలు పట్టింది. నాకు వాళ్ల సంపూర్ణ మద్దతు ఉందని తెలుసు’ అన్నాడు. 

Tags:    

Similar News