గర్వంతో పొంగిపోతున్నామంటూ మహేష్-నమ్రత ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ షూటింగ్ బిజీగా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాకు దూరమై తన లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

Update: 2024-05-27 03:29 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ షూటింగ్ బిజీగా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాకు దూరమై తన లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఆయన కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా.. వెళ్లాడు. ఈ క్రమంలో.. తాజాగా, సూపర్ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ నా హృదయం గర్వంతో పొంగిపొర్లుతోంది. గౌతమ్ నీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయినందుకు అభినందనలు. నీ కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం మొదలైంది.

ఈ అధ్యాయం నీవే రాయాల్సి ఉంది. ఇకపై నీవు మరింతగా ప్రకాశిస్తావని నాకు తెలుసు. నీ కలలను చేదించుకుంటూ ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. నీపై ఎప్పుడూ మా ప్రేమ ఉంటుంది. ఈ రోజు నిన్ను చూసి తండ్రి ఎంతగానో గర్వపడుతున్నాను’’ అని రాసుకొచ్చాడు. అలాగే కొడుకుతో దిగిన ఫొటోలు కూడా షేర్ చేశాడు. ఇక దీనికి నమ్రతా శిరోద్కర్ ‘మాటల్లేవ్.. కేవలం ప్రేమ మాత్రమే’ అని కామెంట్ పెట్టింది. అలాగే ‘‘ నా ప్రియమైన GG, మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. నేను మీ గురించి ఎంత గర్వపడుతున్నానో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.

నీపై నీవు నిజాయితీగా ఉండి నీ ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ.. కలలను సాకారం చేసుకుంటావని అనుకుంటున్నాను. నిన్ను నేను ఎంతగా నమ్ముతున్నానో అందరికంటే ఎక్కువగా నిన్ను నువ్వు నమ్ము. జీవితం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, మీకు ఎల్లప్పుడూ నా ప్రేమ మద్దతు ఉంటుందని తెలుసుకోండి. మీ పెద్ద రోజుకు అభినందనలు. ఇక్కడ ప్రపంచం మీదే. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ గౌతమ్‌కు అభినందనలు చెబుతున్నారు.

Similar News