మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన మహేశ్ బాబు.. ఆనందంలో ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘SSMB 28’.

Update: 2023-05-27 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘SSMB 28’. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే.. ‘SSMB 28’ నుంచి టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. మహేష్‌ బ్యాక్‌ సైడ్‌ నుంచి ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తలకు రెడ్‌ టవల్‌ కట్టుకుని, చేతితో సిగరేట్‌ పట్టుకుని తాగుతూ, చెక్స్ షర్ట్‌లో, రగ్గుడ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో మహేష్‌ లుక్‌ ఊరమాస్‌గా ఉండటం విశేషం. ఈ మహేశ్ బాబు మాస్ లుక్ ఫ్యాన్స్‌ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

Tags:    

Similar News