Mahesh-Babu ‘గుంటూరు కారం’ ఫస్ట్ గ్లింప్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB 28’ నుంచి అప్డేట్ వచ్చేసింది.

Update: 2023-05-31 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB 28’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్‌ను ‘గుంటూరు కారం’ గా ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా పోస్టర్‌తో పాటు సినిమా ఫస్ట్ గ్లింప్స్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఫ్యాన్స్ కోసం మొదట థియేటర్లలో రిలీజ్ చేయగా.. తాజాగా యూట్యూబ్‌లో వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ మాస్ లుక్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు తలకు స్కార్ఫ్ కట్టుకుని ఊర మాస్ స్టైల్‌లో ఫైట్ చేస్తున్న సీన్స్‌ని చూడవచ్చు. మహేష్ బాబు లుక్, స్టైల్, గ్లింప్స్‌లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో అదిరిపోయాయి. కాగా.. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News