బుల్లితెరపై మహేష్ బాబు సందడి.. డ్యాన్స్ అదరగొట్టేశాడు!

దిశ, సినిమా: సాధారణంగా ప్రైవేట్ షోలకు దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు.. Latest Telugu News

Update: 2022-08-30 07:46 GMT

దిశ, సినిమా: సాధారణంగా ప్రైవేట్ షోలకు దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు.. తన కూతురు సితారతో ఓ రియాల్టీ డాన్స్ షోకు హాజరై అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. జీ తెలుగు చానెల్‌లో ప్రసారం అవుతున్న 'డాన్స్ ఇండియా డాన్స్'కు హాజరుకాగా.. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. బుల్లితెరపై కొన్నేళ్ల క్రితం ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరించిన 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' షోలో అలరించిన మహేష్ బాబు.. చాలా కాలం తర్వాత మళ్లీ స్మాల్ స్క్రీన్‌పై సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ సెప్టెంబర్‌ 4న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుండగా.. అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News