మహేశ్ ‘గుంటూరు కారం’లో అనసూయ..

హాట్ యాంకర్ అనసూయ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

Update: 2023-10-05 14:50 GMT

దిశ, సినిమా: హాట్ యాంకర్ అనసూయ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. హిట్- ఫట్ అనే విషయం పక్కన పెడితే నటిగా మాత్రం తనను తాను నిరూపించుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంలోకీ రోల్ పోషించబోతుంది. అది కూడా ఆంటీ పాత్రలో అని టాక్ వినపడుతుంది. అంతేకాదు ఈ క్యారెక్టర్ మూవీలో చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుందని తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రానప్పటికీ ప్రజెంట్ ఈ అప్‌డేట్ వైరల్ అవుతుంది.

Tags:    

Similar News