‌ఆ ఉమెన్ డైరెక్టర్‌ను తిట్టిన సందీప్ రెడ్డి వంగా.. చేతలతో ఇచ్చిపడేసిందిగా...

'Laapata Ladies' సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. చిన్న సినిమానే అయినా సామాజిక సందేశంతో

Update: 2024-05-24 07:35 GMT

దిశ, సినిమా : 'Laapata Ladies' సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. చిన్న సినిమానే అయినా సామాజిక సందేశంతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఫెమినిస్ట్ మూవీ అంటే ఇది అని బాలీవుడ్ కు కొత్త పాఠాలు నేర్పుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో నటించింది చాలా చాలా నార్మల్ పీపుల్ కాగా ఆడియన్స్ అప్లాజ్ అందుకుంటున్నారు. డైరెక్షన్, టేకింగ్ మరో లెవల్ లో ఉందంటూ స్పెషల్ అప్రిసియేషన్ దక్కించుకుంటుంది కిరణ్. ఇక రివ్యూస్ కూడా అద్భుతంగా ఉండగా.. ఈ లేడీ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఇచ్చిపడేసింది అంటున్నారు నెటిజన్లు.

విషయం ఏంటంటే.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న 'Laapata Ladies' మూవీ 'యానిమల్ 'ను వ్యూస్ పరంగా బీట్ చేసింది. ఈ చిత్రానికి ఇప్పటికే 13.8M వ్యూస్ రాగా సందీప్ సినిమా 13.6M వ్యూస్ తోనే నిలిచిపోయింది. దీంతో ఆడియన్స్ న్యూ ఫేవరెట్ గా అవతరించింది ఈ చిన్న సినిమా. అయితే గతంలో 'యానిమల్' హింసాత్మకంగా ఉందని కిరణ్ కామెంట్ చేయగా.. ముందు తన భర్త సినిమాల సెలక్షన్ ఎలా ఉందో చూసుకోమని పంచ్ వేసాడు సందీప్. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వార్ జరుగుతుండగా.. కిరణ్ మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిపడేసింది అంటున్నారు నెటిజన్లు.

Similar News