ఎవరేమనుకున్నా.. అలాంటి క్యారెక్టర్లే చేస్తా: Kriti Sanon

స్టార్ నటి కృతిసనన్ భిన్నమైన పాత్రలు పోషించడమే తనకు ఇష్టమంటోంది.

Update: 2023-02-09 07:43 GMT

దిశ, సినిమా: స్టార్ నటి కృతిసనన్ భిన్నమైన పాత్రలు పోషించడమే తనకు ఇష్టమంటోంది. ఇటీవల వరుస ఆఫర్లతో కెరీర్‌లో దూసుకుపోతున్న ఆమె అందంతో పాటు కథలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతానంటోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నటి.. 'సినిమాల్లో ఎందుకు గ్లామర్ షో చేయట్లేదని చాలామంది అడిగారు. 'మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు'? అని ప్రశ్నించారు. అంతేకాదు జుట్టు చిన్నగా ఎందుకు ఉంచుకుంటారన్నారు. అయితే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. నేను ఎల్లప్పుడూ నా సహా నటీమణులకంటే డిఫరెంట్‌గా ఉండేందుకే మొగ్గుచూపుతా. తెరపై ఎలా కనిపించినా ఇబ్బందిగా ఫీల్ అవ్వను . ఎందుకంటే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. సరికొత్త పాత్రలు, వేషాధారణలున్నా స్టోరీస్ ఎంచుకోవడానికే ఆసక్తి చూపిస్తా' అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి : Sri Devi అభిమానులకు గుడ్ న్యూస్.. బయోగ్రఫీకి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

Tags:    

Similar News