ప్రధాని మోడీ బయోపిక్‌లో నటించడంపై ‘కట్టప్ప’ క్లారిటీ

ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బహూబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచ వ్యా్ప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు

Update: 2024-05-22 16:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బహూబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచ వ్యా్ప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. కట్టప్ప పాత్రతో ఎనలేని క్రేజ్ దక్కించుకున్న సత్య రాజ్‌.. మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌లో నటుడు సత్య రాజ్ ఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోడీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఎట్టకేలకు సత్య రాజ్ స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను నేను కూడా చూశానని, కానీ ఆ పాత్ర కోసం తనను ఇప్పటి వరకు ఎవరూ సంప్రందించలేదని క్లారిటీ ఇచ్చారు. మోడీ బయోపిక్‌లో తాను యాక్ట్ చేస్తోన్న చేస్తున్నట్లు వస్తో్న్న వార్తలన్నీ ఫేక్ అని ఈ సందర్భంగా కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను చూసి జనం నమ్ముతున్నారని అన్నారు. అ వార్తల్లో వాస్తవం లేదని సత్య రాజ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో మోడీ బయోపిక్‌లో సత్య రాజ్ నటిస్తోన్నట్లు వస్తోన్న వార్తలకు చెక్ పడింది. కాగా, ప్రధాని మోడీపై ఇప్పటికే ఒక బయోపిక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానిపై మేకర్స్ మరో బయోపిక్‌కు ప్లాన్ చేస్తోన్నట్లు టాక్.

Similar News