Karthik Nair: కార్తికకు అరుదైన గౌరవం.. యూఏఈ నుంచి గోల్డెన్‌ వీసా

యంగ్ బ్యూటీ కార్తికా నాయర్‌కు అరుదైన గౌరవం దక్కింది.

Update: 2023-03-21 08:18 GMT

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ కార్తికా నాయర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొన్నేళ్లుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్ధి చేయడంలో విశేషమైన పాత్ర పోషిస్తున్న నటికి యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందింది. దుబాయ్‌లోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూఏఈకి చెందిన హమద్‌ అల్మన్సూరి.. కార్తికకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన నటి.. ‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది. వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తాను’ అంటూ హ్యాపీగా ఫీల్ అయింది.

Also Read:   మద్యం మత్తులో నటి ఇంటికెళ్లిన హీరో.. బలవంతంగా డోర్ తీసి 

Tags:    

Similar News