ప్రభాస్ బుజ్జి చాలా స్పెషల్.. కారు ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే..

రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జి ఇంట్రడక్షన్ మామూలుగా జరగలేదు. ఓ సినిమా లెవల్ లో ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్.. బుజ్జి టైం స్టార్ట్ అయిందని సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ ఎంట్రీకి అభిమానుల

Update: 2024-05-24 03:41 GMT

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జి ఇంట్రడక్షన్ మామూలుగా జరగలేదు. ఓ సినిమా లెవల్ లో ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్.. బుజ్జి టైం స్టార్ట్ అయిందని సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ ఎంట్రీకి అభిమానుల ఈలలు, గోలలతో రామోజీ ఫిల్మ్ సిటీ మార్మోగిపోయింది. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 'Kalki 2898 AD ' లో భైరవ మామూలుగా ఉండబోడని.. ఈ సారి డార్లింగ్ ప్రపంచానికే కింగ్ అయిపోతాడని ఖుష్ అవుతున్నారు. ఇక ఇదిలా అంటే బుజ్జి పేరుతో ఇంట్రడ్యూస్ అయిన కారు ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగి పోతుంది అంటున్నారు నెటిజన్లు. ఆనంద్ మహీంద్రా పంచుకున్న ఇందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కారు రైట్ సైడ్ టైరు సగటు మనిషిని మించి డిజైన్ చేశారు. పొడవు -6075mm, వెడల్పు - 3380mm, ఎత్తు - 2186mm, రిమ్ సైజ్ - 34.5 ఇంచెస్ ఉండేలా ప్లాన్ చేసారు. వెనుక కూడా ఓ పెద్ద టైరు అమర్చారు. కారు వెయిట్ ఆరు టన్నులు కాగా పవర్ 94Kw, బ్యాటరీ 47KWH. టైర్లను ప్రముఖ కంపెనీ CEAT తయారుచేయగా.. టోటల్ కారును మహేంద్ర, JM మోటార్స్ సంయుక్తంగా డిజైన్ చేశాయి. కాగా మూవీలో తనకోసం ఈ స్పెషల్ కారు తయారు చేసుకుంటాడని తెలుస్తుండగా.. థియేటర్ లో ప్రభాస్ ను చూసేందుకు వెయిట్ చేయలేక పోతున్నామని అంటున్నారు ఫ్యాన్స్.

Read More..

బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ అన్ని రోజులు కష్టపడ్డాడా? ఆయన కమిట్మెంట్‌కు ఫిదా కావాల్సిందే 

Tags:    

Similar News