అల్లు అర్జున్, రామ్ చరణ్‌లపై కుర్చీ మడతపెట్టి తాత షాకింగ్ కామెంట్స్.. ఎన్టీఆర్ గురించి ఏమన్నాడంటే?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ నుంచి ఎంతోమంది తమ టాలెంట్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు.

Update: 2024-05-23 08:27 GMT

దిశ, సినిమా: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ నుంచి ఎంతోమంది తమ టాలెంట్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. కొందరు రీల్స్ వీడియోలతో ఫేమస్ అయితే మరికొందరు ఒకే ఒక్క డైలాగ్‌తో కూడా క్రేజ్ తెచ్చుకున్న వారు ఉన్నారు. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్‌తో కాలాపాషా అనే వృద్ధుడు సెలబ్రిటీ అయిపోయాడు. అప్పట్లో ఈ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్‌ను ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలోనే ఉపయోగించడంతో అందరి దృష్టి కాలా పాషా పై పడింది. అయితే ఈ సాంగ్‌ను వాడుకున్నందుకు గాను ధమన్ అతనికి కొంత డబ్బు సహాయం చేశాడు. దీంతో కుర్చీ మడతపెట్టి తాత ఒక్కసారిగా ఓవర్ నైట్ సెలబ్రిటీగా ఫుల్ ఫేమస్ అయ్యాడు.

కానీ ఆ తర్వాత ఓ కేసులో కాలాపాషా బస్‌లో అందరినీ డబ్బులు అడిగి జీవనం కొనసాగిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక అప్పటి నుండి అతను కనిపించకుండా పోయాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాలాపాషా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ చూశాను. అతని యాక్షన్ కత్తి పట్టి నరికే సీన్ చాలా బాగున్నాయి నాకు నచ్చాయి. అయితే నా దృష్టిలో ప్రభాస్, ఎన్టీఆర్ కత్తి పట్టుకుంటే బాగుంటుంది. దేవర కచ్చితంగా 100 రోజులు అడుతుంది.

నేను కనీసం పది సార్లు అయినా చూస్తాను. ఎన్టీఆర్ చాలా మంచోడు. అతను ఆడపిల్లలకు, అనాథలకు సహాయం చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీ చేసిందే మళ్లీ మళ్లీ చేస్తాడు. కొంచెం డిఫ్రెంట్‌గా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తన కొడుకుతో ఓవర్ యాక్టింగ్ చేయించొద్దని అల్లు అరవింద్‌కు చెప్పాలనిపిస్తుంది’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాలా పాషా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి చెబుతూ.. ‘‘గేమ్ ఛేంజర్ సినిమా నెల రోజులకు మించి ఆడదు. ఇటీవల విడుదలైన పాట నాకు నచ్చలేదు. అలాగే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో నాకు మగధీర అంటే చాలా ఇష్టం అని అన్నాడు. ప్రస్తుతం కుర్చీ మడత పెట్టి తాత కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కాలాపాషాపై మండిపడుతున్నారు.

Similar News