కన్నీళ్లు పెట్టిస్తున్న కాజల్.. తన కొడుక్కు పాలివ్వడానికి అంత కష్టపడిందా!

మాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక స్త్రీ తల్లిగా మారిన తర్వాత తన బిడ్డ గురించి ఎంతగానో ఆరాటపడుతుంది. ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తుంది. ముఖ్యంగా తన బిడ్డ ఆకలి గురించి తల్లి తీసుకునే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా

Update: 2024-05-23 10:17 GMT

దిశ, సినిమా : మాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక స్త్రీ తల్లిగా మారిన తర్వాత తన బిడ్డ గురించి ఎంతగానో ఆరాటపడుతుంది. ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తుంది. ముఖ్యంగా తన బిడ్డ ఆకలి గురించి తల్లి తీసుకునే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమస్యలనే స్టార్ హీరోయిన్ కాజల్ కూడా ఎదుర్కొందంట.

తన బిడ్డకు పాలివ్వడానికి ఆమె పడి కష్టాన్ని చెప్తూ కాజల్ ఎమోషనల్ అయ్యింది. ఈ సంఘటన అక్కడున్నవారందరికీ కన్నీళ్లను తెప్పించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఇండియా2 సినిమాకు ఒకే చెప్పిన తర్వాత బాబు పుట్టిన రెండు నెలలకే షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ సమయంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అప్పుడప్పుడే నేను కోలుకుంటున్నా.. ఈ సమయంలో షూటింగ్‌కు వెళ్లాల, బాబును విడిచి పెట్టి ఉండగలనా అని చాలా అనిపించింది. కానీ తప్పదు. ఇక ఈ మూవీ షూటింగ్ కడప పరిసర ప్రాంతాల్లో జరిగింది. తిరుపతి నుంచి 2 గంటలు జర్నీ. దీంతో నా కొడుక్కి పాలివ్వాలి కదా.. అందుకే అమ్మని, బాబును తిరుపతిలో ఉంచాను. దీంతో నేను షూటింగ్‌కు వెళ్లాక .. లోకేషన్‌లో క్యారవ్యాన్ లోకి వెళ్లి బాటిల్ లో పాలు నింపేదాన్ని. పాలు పాడవకుండా ఐస్ లో పెట్టి కారులో మా డ్రైవర్ చేత తిరుపతికి పంపేదాన్ని. రోజుకి రెండు సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అంటే డ్రైవర్ 8 గంటలు డ్రైవ్ చేస్తూనే ఉండాలి. ఆ సమయంలో నాకు నా డ్రైవర్ చాలా సహాయం చేశాడు. నేను ఇప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కాజల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Similar News