గుడ్ న్యూస్ చెబుతానంటూ జ్యోతి రాయ్ పోస్ట్.. 38 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతుందా?

నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడంగా కనిపించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

Update: 2024-05-22 09:54 GMT

దిశ, సినిమా: నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడంగా కనిపించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు హాట్ ఫొటోలు షేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. మోడ్రన్ డ్రెస్‌లో చూసి ఏంటీ ఆరాచకం అనుకున్నారు. అయితే జ్యోతి రాయ్ నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఓ యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉండి ఫొటోలు షేర్ చేయడంతో నెట్టింట దుమారం రేపింది.

వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు పలు వార్తలు కూడా వచ్చాయి. కానీ జ్యోతి రాయ్ స్పందించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, జ్యోతి రాయ్ పెట్టిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్యాక్ ఫొటోలు షేర్ చేస్తూ ‘‘త్వరలో ఒక గుడ్ న్యూస్ ఉంది’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో జ్యోతి రాయ్ పోస్ట్ చూసిన వారంతా ఏదైనా సినిమా ప్రకటిస్తుందా? లేక 38 ఏళ్ల వయస్సులో ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి షాకిస్తుందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News