ఆ స్టార్‌ క్రికెటర్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న జయసుధ.. గే అని తెలియడంతో అలా చేసిన నటి

అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ అందరికీ సుపరిచితమే. ఈమె తొలితరం అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-05-27 04:57 GMT

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ అందరికీ సుపరిచితమే. ఈమె తొలితరం అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం సెలక్టివ్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకొని నటిస్తుంది. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలు, అత్త పాత్రలో నటిస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా జయసుధ రెండు సార్లు పెళ్లి చేసుకోగా తన రెండో భర్త నితీన్‌ కపూర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అందులో భాగంగా తనని హీరోయిన్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏ హీరోతో నైనా క్రష్ ఉందా అని అడగగా.. ఆమె ప్రారంభంలో తనకు కూడా క్రష్ ఉండేదని తెలిపింది. తనకు క్రికెటర్లపై బాగా ఇంట్రెస్ట్ ఉండేదట. వాళ్లంటే చాలా క్రష్‌గా ఫీలయ్యేదట. అలా పాకిస్తానీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చాలా రోజులు కలలు కన్నాను. కానీ ఆ క్రష్‌ పెళ్లి వరకు వెళ్లలేకపోయిందని చెప్పింది.


దీంతోపాటు ఓ షాకింగ్‌ విషయం కూడా బయటపెట్టింది జయసుధ. తనకు సింగర్స్ పై బాగా ఆసక్తి ఉండేదని, ఇమ్రాన్‌ ఖాన్‌ మాదిరిగానే వారిని కూడా పెళ్లి చేసుకుంటే బాగుండేదనే కలలు కన్నాను. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ సింగర్ గే అని తెలిసి పెద్ద షాక్‌కి గురయ్యాను. వామ్మో మనం టెంప్ట్ అయితే కొంప మునిగేదనీ ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది జయసుధ. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Similar News