ఎన్టీఆర్‌ను అవమానించిన జాన్వీ కపూర్.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ విషయంలో షాకింగ్ రియాక్షన్!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-24 09:03 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, తారక్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచాయి. దేవర ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ చేసిన పనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. దానికి కారణం దేవర సినిమా కంటే.. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ పై ఎక్కువ దృష్టి పెట్టడంతో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏం చేసిందంటే.. దేవర అప్డేట్స్ పోస్ట్ చేసినప్పటికీ లైక్ కొట్టలేదు.

కానీ తనకు ఎలాంటి సంబంధం లేని పుష్ప-2 సినిమా సాంగ్ ప్రోమోకు మాత్రం జాన్వీ లైక్ కొట్టింది. అలాగే దేవర సినిమా కంటే ఈ బ్యూటీ పుష్ప-2 పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అర్థం అయ్యేలా ప్రవర్థిస్తుందట. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ పాటకు లైక్ కొట్టి ఎన్టీఆర్‌ను అవమానించిందని.. సొంతం సినిమా కంటే ఇతర చిత్రంపై అంత ఇంట్రెస్ట్ ఎందుకు అంటున్నారు. కానీ జాన్వీ ఫ్యాన్స్ వాటిని కొట్టిపారేస్తూ.. ఒక చిన్న లైక్ కొట్టలేదని ఇలా అనడం తప్పు అని వాదిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ పుష్ప-2 విషయంలో చేసిన పనికి నెట్టింట పలు రకాల అనుమానాలు మొదలయ్యాయి.

Read More..

జనసేన పార్టీ కోసం నా డబ్బంతా ఖర్చు చేసి చిల్లిగవ్వ లేకుండా ఉన్నా.. చివరికి ఆయన ఏం చేశారు.. షకలక శంకర్ షాకింగ్ ...

Similar News