Avatar 3 & 4 పై కూడా క్లారిటీ ఇచ్చిన James Cameron

హాలీవుడ్ మూవీ 'అవతార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2023-01-09 06:09 GMT

దిశ, సినిమా: హాలీవుడ్ మూవీ 'అవతార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ప్రియులెవరూ దీనిని మర్చిపోలేదు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచాన్నే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్​ 'అవతార్' ‌కు గతేడాది సీక్వెల్‌గా వచ్చిన 'అవతార్-2' ది వే ఆఫ్​ వాటర్' డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టింది. ఇక అప్డేట్ ఏమిటంటే.. జెమ్స్ ఒక చాట్ షోలో మాట్లాడుతూ..' అవతార్ 3' కి సంబంధించి ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది. మొత్తం చిత్రాన్ని క్యాప్చర్ చేశాం. దీనికి సంబంధించిన ఫోటో తీశాం' అన్నారు. ఫ్రాంచైజీలు, మరిన్ని సినిమాల గురించి.. ప్రముఖ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఆపై అవతార్ 4, 5 రెండూ రాయబడ్డాయి. ఈ సమయంలో ఫ్రాంచైజీని కూడా ప్రారంభించాం' అన్నారు. కానీ దాదాపు ఆరేండ్ల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మొత్తానికి లేట్ అయినా 'అవతార్ 3' మరో అద్భుతంగా నిలిచేలా రాబోతున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News