జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో ఇండస్ట్రీ

బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది జబర్దస్త్ కామెడీ షో.

Update: 2024-05-16 05:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది జబర్దస్త్ కామెడీ షో. ప్రేక్షకులను కడపుబ్బా నవ్విస్తూ ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. కొంతమంది కమెడియన్లు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ వెండితెరపై కూడా మంచి క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఇందులో కెవ్వు కార్తీక్ ఒకరు. చాలా ఏళ్లుగా జబర్దస్త్ షో లో రాణిస్తున్నాడు. ప్రేక్షకులను తనదైన టైమింగ్ పంచులతో అలరిస్తూ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా కార్తీక్ ఇంట్లో విషాదం చోటు చోటుచేసుకుంది. ఈయన తల్లి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దాదాపు ఐదేళ్లకు పైనే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందట. కానీ అనూహ్యంగా కార్తీక్ తల్లి బుధవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కెవ్వు కార్తీక్ ఇంట్లో అలాగే జబర్దస్త్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయాన్ని కార్తీక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పోస్టులో.. ఐదేళ్లుగా తను క్యాన్సర్ తో పోరాటం చేసిందని, తన జీవితం మొత్తం యుద్ధమేనని, కష్టాల్లో మాకు తోడుగా నిలిచావని కెవ్వు కార్తీక్ రాసుకొచ్చారు. నీ ఆత్మస్థైర్యమే నాలో ధైర్యాన్ని నింపిందని, కానీ నీవు లేకుండా ఎలా బతకాలో ఎందుకు నేర్పించలేదమ్మా అంటూ కెవ్వు కార్తీ ఎమోషనల్ అయ్యారు. తన అమ్మకు ఐదేళ్లుగా చికిత్స అందించిన వైద్యులకు పాదాభివందనాలు తెలిపాడు.  

Similar News