ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ పేరు టాటూ.. వారి మధ్య ఉన్న బంధం అదేనా?

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, ఉదయ్ శెట్టి కాంబినేషన్‌లో ‘గం గం గణేషా’ సినిమా రాబోతుంది.

Update: 2024-05-27 09:40 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, ఉదయ్ శెట్టి కాంబినేషన్‌లో ‘గం గం గణేషా’ సినిమా రాబోతుంది. ఇందులో నయన్ సారిక, ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే మే 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో.. ఆనంద్ దేవరకొండ, ఇమ్మానియేల్ , యావర్, నయన్ సుమా అడ్డా షోకు హాజరయ్యారు. అయితే వీరంతా బేబీ స్పూఫ్ చేసి ఆడియన్స్‌ను కడుపుబ్బేలా నవ్వించారు. ఆ తర్వాత ఇమ్మానియేల్ నా ఫ్రెండ్ ఆనంద్ టాటూ కూడా వేయించుకున్నాడని చూపిస్తాడు.

దీంతో సుమ ఎలా దొరికాడు ఇలాంటి ఫ్రెండ్ మీకు అని ఆనంద్‌ను అడుగుతుంది. అలాగే ఇమ్మానియేల్ పేరును నువ్వు టాటూగా వేయించుకున్నావా అని షాక్ అవుతుంది. దానికి ఆనంద్ స్పందిస్తూ.. వాడి హెయిర్ స్టైల్ నాకు చాలా ఇష్టం అందుకే వేసుకున్నాను అంటాడు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఆనంద్ టాటూ గురించే అంతా చర్చించుకుంటున్నారు. వారి మధ్య ఏదైనా బంధం ఉండొచ్చు అందుకే వేయించుకున్నాడని అనుకుంటున్నారు. కానీ గం గం గణేశా సినిమాలో ఇమ్మానియేల్, ఆనంద్ స్నేహితుడిగా నటించాడు. అందుకే సినిమా కోసం తాత్కాలిక టాటూ వేసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ అనంతరం తొలగించనున్నాడట.

Read More...

ఏడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Similar News