‘హనుమాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్‌లో ‘హనుమాన్’ ఒకటి.

Update: 2023-10-05 09:38 GMT

దిశ, సినిమా: అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్‌లో ‘హనుమాన్’ ఒకటి. తేజా సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ లేడీ లీడ్ రోల్‌ చేస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరబ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌‌డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మూవీకి కలర్ గ్రేడింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశాడు. మొత్తానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

Read More:       స్టార్ డైరెక్టర్ పేరుతో మోసం.. నటుడు బ్రహ్మాజీ ట్వీట్ వైరల్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News