విజయ్ ‘vd14’కు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్.. రౌడీ హీరో యోధుడిగా కనిపించనున్నాడా?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రౌడీ హీరోగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

Update: 2024-05-23 11:20 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రౌడీ హీరోగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ రౌడీ హీరో ఫ్లాప్, హిట్ అని చూడకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో విజయ్ ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే ఈ మూవీ 1854 నుంచి 1894 మధ్య జరిగిన కథతో తెరకెక్కించనున్నట్లు టాక్. అలాగే ఇందులో విజయ్ యోధుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘vd14’ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ‘రణభాలి’ అనే టైటిల్‌తో రాబోతుందట. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే ఇందులో విజయ్ యోధుడిగా కనిపిస్తున్నాడని తెలిసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వామ్మో ఆ గెటప్‌లో చూడగలమా లేదా? అని చర్చించుకుంటున్నారు.

Similar News