పవన్ కల్యాణ్ OG నుంచి అదిరిపోయే న్యూస్.. స్వయంగా రివీల్ చేసిన డైరెక్టర్ సుజిత్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెండింగ్ ప్రాజెక్టులలో OG ఒకటి.

Update: 2024-05-27 11:37 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెండింగ్ ప్రాజెక్టులలో OG ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కల్యాన్ ఏపీ ఎన్నికల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ వచ్చాక మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారని సమాచారం. ఈ క్రమంలో ఓజీ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

టైటిల్, హీరో పాత్రపై డైరెక్టర్ సుజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుజిత్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలో హీరో పేరు ఓజాస్ గంభీరా అని చెప్పేశారు. ఇందులో హీరోకు డబుల్ రోల్ ఉంటుందని.. ఓజాస్ క్యారెక్టర్ మాస్టర్ పాత్ర అని, గంభీరా గ్యాంగ్‌స్టర్ పాత్ర అని చెప్పేశారు. అభిమాన హీరో కాబట్టి తాను ఎలా ఊహించుకున్నానో.. అలాగే సినిమా చేశాను అని సుజిత్ చెప్పారు. దీంతో మరో లెవెల్‌లో ఉండబోతోందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Read More...

మళ్లీ మళ్లీ తనతో అలా చేసే రోజు రావాలి.. పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!

Tags:    

Similar News