బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ సారి నన్ను వదిలేశారు.. నవదీప్ షాకింగ్ కామెంట్స్!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు గత కొద్ది రోజులుగా నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

Update: 2024-05-26 06:36 GMT

దిశ, సినిమా: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు గత కొద్ది రోజులుగా నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు రావడంతో అంతా షాక్ అయ్యారు. ఇందులో హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, నటి హేమ, అషికా పలువురు నటీనటులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కొందరు స్పందించి తాము అసలు ఆ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. కానీ బెంగళూరు రేవ్ పార్టీకి నటి హేమ వెళ్లినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. ఫ్లైట్ టికెట్స్, ఆమె రక్త నమూనాలు రేవ్ పార్టీకి వెళ్లినట్లు నిర్ధారించాయి. దీంతో పోలిసులు ఆమెకు నోటీసులు పంపారు.

కానీ హేమ మాత్రం నాకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు నేను అసలు బెంగళూరుకు వెళ్లలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు.. టాలీవుడ్ హీరో నవదీప్‌ను పలు రకాలు ప్రశ్నలు అడిగారు. బెంగళూరు రేవ్ పార్టీలో నువ్వు ఉన్నట్లు వార్తలు రాలేదని అడిగారు. తాజాగా, లవ్ మౌళి ప్రమోషన్స్‌లో పాల్గొన్న నవదీప్ తాను రేవ్ పార్టీకి వెళ్లినట్లు వార్తలు రాలేదనే విషయంపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సారి మీ పేరు ఎందుకు బయటకు రాలేదని యాంకర్ అడగ్గా.. నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు వార్తలు రాకపోవడం వల్ల చాలా మంది నిరుత్సాహపడి ఉంటారు. ఎందుకంటే ఎక్కడ రేవ్ పార్టీ, డ్రగ్స్ తీసుకున్నారన్న కేసుల్లో నేను ఉన్నానని ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ సారి నన్ను వదిలేశారు. అయినా నాకు మంచే జరిగింది. రేవ్ పార్టీ అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నవదీప్ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Similar News