ఆ సీక్రెట్‌ను బయటపెట్టిన ఇలియానా..ఆ డైరెక్టర్ వల్లే టాలీవుడ్‌కు దూరమయ్యానంటూ కామెంట్స్ !
తన నడుముతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ముద్దుగుమ్మ ఇలియానా. ఈ గోవా బ్యూటీ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే, దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన అందంతో హాట్ ఫిగర్‌గా టాలీవుడ్‌నే
దిశ, సినిమా : తన నడుముతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ముద్దుగుమ్మ ఇలియానా. ఈ గోవా బ్యూటీ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే, దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన అందంతో హాట్ ఫిగర్‌గా టాలీవుడ్‌నే షేక్ చేసింది. ఇక ఇలియానా అనగానే అందరికీ ఆమె నడుమే గుర్తు వస్తుంది. అంత అందంగా నాజుకుగా సన్నగా ఉండే నడుమును గిరగిరా తిప్పుతూ కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. పవ్న్ కళ్యాణ్ జల్సా సినిమా తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. పోకిరి ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్రేంజ్కు ఎదిగిపోయింది. అయితే తర్వాత కూడా ఈ నటి తెలుగు చిత్ర పరిశ్రను ఏలుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి టాలీవుడ్‌కు సడెన్ గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. అయితే దీనికి గల కారణం ఏంటో చెప్పేసింది ఇలియానా.
టాలీవుడ్ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ బర్ఫీ సినిమాలో అవకాశం రావడంతో ఆమె ఆ సినిమాలో నటించి, సూపర్ హిట్ అందకుంది. అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత టాలీవుడ్ బడా డైరెక్టర్ ఇలియానా గురించి చాలా తప్పుగా చెప్పుకొచ్చాడంట. గోవా బ్యూటీకి బాలీవుడ్లోనే చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆమె అక్కడే చేస్తుంది. అంతే కాదు తెలుగు దర్శకులను చాలా చులకనగా చేస్తుందంటూ లేనిపోనివి చెప్పి బాగా ట్రెండ్ చేశాడంట. దీంతో పలవురు ఇలియానాకు అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపలేదంట. తాజాగా ఇలియాన ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.