వామ్మో.. ప్రియాంక చోప్రా వేసుకున్న నెక్లెస్ ధర అన్ని కోట్లా?

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని షేక్ చేసింది.

Update: 2024-05-22 15:35 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం హెడ్ ఆఫ్ స్టేట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ అమ్మడు పర్సనల్ విషయానికొస్తే.. హాలీవుడ్ సింగర్ నిగ్ జోనాస్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే నిత్యం ప్రియాంక చోప్రా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుని నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక ఓ ఈవెంట్‌లో ధరించిన నెక్లెస్ ధర సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రోమ్‌లో బుల్గారీ 140 వార్షికోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆమె ధరించిన నెక్లెస్‌పైనే అందరి దృష్టి పడింది. ప్రియాంక 140 క్యారెట్ల డైమండ్‌తో తయారు చేసిన నెక్లెస్ వేసుకుంది. అయితే దీని ధర ఏకంగా రూ. 358 కోట్లు అని సమాచారం. దీనిని 2,800 గంటల సమయం పాటు కొంతమంది తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

Similar News