బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెడితే హోదా రాదు: Shruti Haasan

టాలీవుడ్ నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మంచి చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2023-01-28 15:05 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మంచి చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జనవరి 28 శృతిహాసన్ పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే 'తన తండ్రి గొప్ప నటుడు కావడంతో ఆమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తుంది' అంటూ గతంలో వార్తలు వచ్చాయి.

తన పుట్టినరోజు సందర్భంగా శృతిహాసన్ నెపోటిజం గురించి షాకింగ్ పోస్ట్ చేశారు 'తండ్రి గొప్ప నటుడు అయితే అలాంటి స్టార్ హోదా మనకు అంత సులభంగా రాదు. ఆ హోదా అనుభవించడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది' అని తెలియజేసింది.

Tags:    

Similar News