లొకేషన్‌లో బట్టలు మార్చుకుంటే ఎవరెవరో చూసేవారు.. అలనాటి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘రోజా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తన అందం, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.

Update: 2024-05-21 04:20 GMT

దిశ, సినిమా: ‘రోజా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తన అందం, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కెరీర్ మొత్తంలో ఆమె ఆరు భాషల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా అలరిస్తూ శ్రేయాస్ తల్పాడేతో తాజాగా ‘కర్తం భుగ్తం’ అనే మూవీలో నటించింది. ప్రస్తుతం ఇప్పుడు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. కాగా ఇటీవల కంగనా రనౌత్‌తో 'తలైవి', సమంతాతో 'శాకుంతలం' చిత్రాలలో కూడా నటించింది.

అయితే మధుబాల తాజాగా ఆ నాటి పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పుకొచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు లేడీస్‌కి సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయి. నేను ఎర్ర గుహలలో, కొలాచిలో తమిళ చిత్రాల షూటింగ్‌లు చేస్తున్నప్పుడు ఆరుబయటే బట్టలు మార్చుకోవల్సి వచ్చేది. ఆ సమయంలో ఎవరు చూస్తున్నారో తెలియక పోయేది. బట్టలు మార్చుకోవడానికి పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఇక కొండ ప్రాంతాల్లో చెట్ల కిందనే మరుగుదొడ్డిగా భావించే వాళ్లం. ఇరువర్ షూటింగ్ సమయంలో తమిళనాడులో ఒక మారుమూల ప్రదేశంలో షూటింగ్ జరుగుతుండగా, అక్కడ రెస్ట్ తీసుకునేందుకు ప్లేస్ లేకపోవడంతో రాళ్లపైన పడుకున్నాని చెప్పింది మధుబాల.

ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. మనకు మేకప్ కోసం వ్యాన్ కావాలని అడగొచ్చు, గోప్యతకు అవకాశం ఉంది. అప్పుడు అంత డబ్బు సంపాదించిన కూడా ఏం లాభం. రాళ్ల మీద పడుకోవల్సి వచ్చేది లేడీస్ ఆ రోజుల్లో పడ్డ ఇబ్బందులు అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చింది.

Similar News