జనసేన పార్టీ కోసం నా డబ్బంతా ఖర్చు చేసి చిల్లిగవ్వ లేకుండా ఉన్నా.. చివరికి ఆయన ఏం చేశారు.. షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కోసం ఎంతో మంది ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు.

Update: 2024-05-24 09:53 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కోసం ఎంతో మంది ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. అయితే పవన్ అంటే సినీ సెలబ్రిటీలకు కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే సినీ నటుడు షకలక శంకర్ కూడా పవన్‌కు విరాభిమాని.

తరచుగా తన అభిమానం చూపిస్తూనే ఉంటాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేశానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ కొన్ని సినిమాల్లో నటించడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేదు. వాళ్లు నాకోసం ఎదురుచూస్తున్నారు. కానీ నేను గత ఎన్నికల్లో సొంత డబ్బుతో ప్రచారం చేశాను. రూ. 3 లక్షలతో భోజనాలు పెట్టించి ఎంతో మంది ఆకలి తీర్చాను. తీరా ఇంటికి వెల్దామనే సరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. మా ఫ్రెండ్‌తో 1000 రూపాయల డీజిల్ కొట్టించుకుని ఇంటికి వెళ్లాను. డబ్బులన్నీ ఖర్చు చేశాను అని నా భార్యకు చెప్తే నాలుగు రోజులు మాట్లాడకుండా ఉన్నది.

మా మామయ్య కూడా బాధపడి పవన్ కల్యాణ్‌పై ప్రేమతో నువ్వు ఇంత చేశావు కనీసం ఆయన నీకు ఫోన్ అయినా చేశాడా? తిరిగి నీకు ఏం చేశాడని అడిగాడు. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను ఆయన నుంచి ఏదో ఆశించి డబ్బులు ఖర్చు చేయలేదు. అభిమానంతో చేశాను. మా మావయ్య అలా అనేసరికి నేను ఎక్కడో శ్రీకాకుళంలో చేస్తే ఆయనకు తెలుస్తుందా? అని అనుకున్నాను. మళ్లీ తెలిసి ఉండవచ్చు అని భావించాను. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా నేను పాల్గొన్నాను. కానీ ముందుగానే జనసేన పార్టీ వారికి చెప్పేశాను. నా దగ్గర డబ్బులు లేవు కానీ ప్రచారం చేస్తాను అని. దీంతో డీజిల్, ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళు చూసుకున్నారు’’ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Similar News