డబ్బు కోసం ఆ పని చేశా.. వెళ్లి అద్దంలో ముఖం చూసుకోమని హేళన చేశారు.. బిగ్ బాస్ కీర్తి

సీరియల్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ భట్ అందరికీ సుపరిచితమే. సీరియల్‌లో నటిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-05-23 08:38 GMT

దిశ, సినిమా: సీరియల్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ భట్ అందరికీ సుపరిచితమే. సీరియల్‌లో నటిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అయితే కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్య, వదినలను కోల్పోయిన కీర్తి తీవ్రగాయాలతో చాలాకాలం పాటు కోమాలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న కీర్తి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది.

తాజాగా కీర్తి ‘కాఫీ విత్ శోభా’ ప్రోగ్రాంలో కాబోయే భర్త కార్తీక్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి నుంచి బయట పడేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించింది. “అమ్మానాన్న చనిపోయిన తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చాక.. ఓ సీరియల్ ఆడిషన్ కు వెళ్లాను. ఓ పేపర్ ఇచ్చారు. ఆడిషన్ చేశారు. “సర్.. మమ్మల్ని సెలెక్ట్ చేశారా?” అని అడిగాను. “నీ ముఖం అద్దంలో చూసుకున్నావా?” అన్నారు అక్కడ ప్రొడక్షన్ మేనేజర్. అదే సీరియల్ లో రెండు సంవత్సరాల తర్వాత నేను మెయిన్ లీడ్ చేశాను. అప్పుడు అదే ప్రొడక్షన్ మేనేజర్ తో పక్కన కూర్చొని, “సర్ ఇప్పుడు నా ముఖం బాగుందా?” అని అడిగాను. తను సిగ్గుతో తల దించుకున్నాడు” అని చెప్పింది. అలాగే డబ్బుల కోసం దొంగతనం కూడా చేశానని కన్నీళ్లు పెట్టుకుంది.

కీర్తి ప్రస్తుతం ‘మధురానగరిలో’ సీరియల్ చేస్తోంది అని మన అందరికీ తెలిసినదే.

Similar News