నా పండమ్మని చూస్తే చాలా గర్వంగా ఉంది.. సుకుమార్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Update: 2024-05-23 13:43 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొందరలోనే సెకండ్ సాంగ్ కూడా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అలాగే పుష్ప-2 మూవీ ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. సుకుమార్ డైరెక్షన్‌లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు. పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

తాజాగా, సుకుమార్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఇటీవల సుక్కు కూతురు సుకృతి సింగర్‌గా మ్యూజిక్ కన్సర్ట్ ఓ సాంగ్ పాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఫిదా చేస్తుంది. ఇక ఇప్పుడు సుకుమార్ తన కూతురు పాట పాడటంపై ప్రశంసలు కురిపించాడు.‘‘ నా పండమ్మని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అలాగే వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తండ్రి తగ్గ తనయ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

Similar News