పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ (పోస్ట్)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికీ అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే.

Update: 2024-04-30 07:25 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికీ అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే. దీనిని ఏం ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలై చాలా రోజులవుతుంది. కానీ పోస్టర్స్ తప్ప మరో అప్డేట్ రాలేదు. దానికి కారణం.. తొందరలో ఎన్నికలు ఉండటంతో పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వడం వల్ల ఎలాంటి సమాచారం రాలేదు.

కానీ ఫ్యాన్స్ మాత్రం నిత్యం పలు పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ తొందరలో అప్డేట్ వస్తుందని సడెన్‌గా ఓ పోస్ట్ షేర్ చేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపారు. తాజాగా, హరిహర వీరమల్లు సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మేకర్స్ ట్విట్టర్ వేదికగా ‘‘ధర్మం కోసం యుద్ధం’’ అని ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. మే 2న ఉదయం 9 గంటలకు టీజర్ విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News