ఒకవైపు తాత.. మరోవైపు తండ్రి.. ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న దిల్ రాజు

తెలుగు సినిమా ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు అనతికాలంలోనే నిర్మాతగా ఎదిగాడు.

Update: 2023-04-09 11:11 GMT

దిశ, సినిమా: తెలుగు సినిమా ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు అనతికాలంలోనే నిర్మాతగా ఎదిగాడు. అతను ఇటీవల సినిమా ఇండస్ట్రీకి వచ్చి 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా తన మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం, కుమారుడు పుట్టడం లాంటి విషయాలను పంచుకున్నారు.

‘నా భార్య చనిపోయిన తర్వాత నా కుమార్తె బలవంతంపై రెండో పెళ్లి చేసుకున్న. ఇప్పుడు నాకు 9 నెలల బాబు ఉన్నాడు. అదే సమయంలో నాకు ఆరేళ్ల మనవడు కూడా ఉన్నాడు. నేను ఇద్దరితోనూ సమయాన్ని గడుపుతాను. వారితో ఆడుకోవడానికి టైం కేటాయిస్తా. నేను నా మనుమడిని కలిసినప్పుడు ఒక తాతగా ఉంటాను. కుమారుడితో ఉన్నప్పుడు తండ్రిగా ప్రవర్తిస్తా’ అని చెప్పాడు.

Tags:    

Similar News