Anupam Kher: అబద్ధాలు చెప్తున్నారంటూ.. ప్రకాశ్ రాజ్‌‌పై ఫైర్ అయిన అనుపమ్ ఖేర్

గతేడాది మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’.

Update: 2023-02-18 06:18 GMT

దిశ, సినిమా: గతేడాది మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. జీ స్టూడియోస్, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, కీలక పాత్ర పోషించారు. ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలిచే నటుడు ప్రకాష్ రాజ్ మొదటి నుంచి ఈ సినిమాను విమర్శిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యే ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. 'కాశ్మీర్ పైల్స్' కు ఆస్కార్ కాదు కదా, భాస్కర్ అవార్డు కూడా రాదు' అన్నాడు. దీంతో అతని వ్యాఖ్యలపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా స్పందించినప్పటికీ.. తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతి ఒక్కరూ వారి స్థాయిని బట్టి మాట్లాడుతారు.. కొందరు జీవితమంతా అబద్ధాలు చెబుతారు. కొంతమంది ఎప్పుడూ నిజమే మాట్లాడుతారు. జీవితం మొత్తం నిజం చెప్పేవాళ్లలో నేనూ ఒకడిని. అబద్ధం చెబుతూ బతకాలనుకుంటే అది వాళ్ల ఇష్టం' అంటూ ముగించాడు అనుపమ్ ఖేర్.

Tags:    

Similar News