అయ్య బాబోయ్.. జాన్వీ కపూర్ ఉదయం లేవగానే ఆ పని చేస్తుందా? ఇంత ఓపెన్ గా చెప్పేసిందేంటీ

అతిలోక సుందరి శ్రీదేవి నటిమని కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-05-26 08:00 GMT

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి నటిమని కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. మత్తెక్కించే కళ్ళ తో కుర్రకారు మనసులు దోచుకుంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అలాగే జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. దాంతో పాటు జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ అండ్ పర్సనల్ విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో జాన్వీ కపూర్ తాను జాతకాలను ఎక్కువగా నమ్ముతాను అనే విషయాన్ని బయట పెట్టడం సంచలనంగా మారింది. జాన్వీ కపూర్ ప్రతిరోజు కూడా తన జాతక చక్రం ఎలా ఉంది అనే విషయాన్ని రాశి ఫలాలు ద్వారా తెలుసుకుంటుందట. అవి కచ్చితంగా ఫాలో కూడా అవుతుందట. తన లైఫ్ లో అవి కీ రోల్ ప్లే చేస్తాయని జాన్వీ కపూర్ నే స్వయంగా చెప్పడం గమనార్హం . జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News