ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న హీరోయిన్.. భర్త గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఇటీవల కాలంలో పెళ్లి అనేది మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది కాలానికే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

Update: 2024-05-26 13:03 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో పెళ్లి అనేది మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది కాలానికే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఆ తర్వాత తమకు నచ్చిన వారితో డేటింగ్ చేసి నమ్మకం వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా, హీరోయిన్ మీరా ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుంది. కెమెరిమెన్ విపిన్‌తో ఐదేళ్లు రిలేషన్ కొనసాగించి కోయంబత్తూరులో పెళ్లయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే తన భర్తకు సంబంధించిన విషయాలను కూడా తెలిపింది. ‘‘మేము అధికారికంగా వివాహం జరిగింది. నేను, మీరా వాసుదేవన్, విపిన్ 21/04/2024న కోయంబత్తూరులో వివాహం చేసుకున్నాము. ఈరోజు అధికారికంగా వివాహిత జంటగా నమోదు చేసుకున్నాము. మీకు విపిన్‌ని సరిగ్గా పరిచయం చేస్తాను.

అతను అలత్తూరుకు చెందిన పాలక్కాడ్ వాసి. అతను DOP/ సినిమాటోగ్రాఫర్ (అందులో అంతర్జాతీయ అవార్డు విజేత). మే 2019 నుండి విపిన్, నేను కలిసి పని చేస్తున్నాము. గత సంవత్సరం కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. 21/04/2024న పెళ్లి చేసుకున్నాము. మీ అందరితో ఈ ఆశీర్వాదం కోసం అధికారిక వార్తను పంచుకుంటున్నాను.

మీరు నా భర్త విపిన్‌పై కూడా అదే ప్రేమ, మద్దతును పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. కాగా, మీరా సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్‌ తనయుడు విశాల్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కాపురం కొద్ది కాలం బాగానే ఉన్నప్పటికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అమ్మడు 2012లో మలయాళ నటుడు జాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. 2016లో విడాకులు తీసుకుని విడిపోయినట్లు సమాచారం. ఇక అప్పటినుంచి మీరా, విపిన్‌తో ప్రేమలో ఉండి ఈ ఏడాది పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం గురించి తెలిసిన వారు మీరా వాసుదేవన్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Similar News