డబ్బులు లేక టీ అమ్ముకున్న హీరోయిన్.. వైరల్ అవుతున్న న్యూస్!

టాలీవుడ్ సీనియర్ నటి లయకు సంబంధించిన న్యూస్ ఈ మధ్య తెగ వైరల్ అవుతుంది. చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఇచ్చి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.

Update: 2024-05-24 02:56 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ నటి లయకు సంబంధించిన న్యూస్ ఈ మధ్య తెగ వైరల్ అవుతుంది. చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఇచ్చి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి తమ అభిమానులతో చాలా విషయాలు షేర్ చేసుకుంది. అంతే కాకుండా తాను ఎదుర్కొన్న సమస్యలు, అవమానాల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తనపై వచ్చిన రూమర్ గురించి చెబుతూ లయ ఎమోషనల్ అయ్యింది.

అసలు విషయంలోకి వెళ్లితే.. స్వయం వరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మంచి పాపులరిటీ ఉన్న సమయంలోనే ఎన్నారైని వివాహం చేసుకొని, చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత లయకు సంబంధించిన అనేక పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా.. హీరోయిన్ లయ భర్త ఆస్తులన్నీ పోయి లయ ప్రస్తుతం అమెరికాలో టీ హోటల్ పెట్టుకుని టీ అమ్ముకుంటుందని ఒక రూమర్ చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై లయ మాట్లాడుతూ.. ఈ వార్త మా ఫ్యామిలీని చాలా బాధపెట్టింది. ఇండస్ట్రీకి దూరమైతే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారా? అసలు అందులో ఎలాంటి నిజం లేదు అని, నేను నా ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అనుకున్నాను అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యానంటూ చెప్పుకొచ్చింది.

Similar News