హీరోయిన్ లైలా దారుణ హత్య.. కనికరం లేకుండా కాల్చి చంపిన తండ్రి..

బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్ దారుణ హత్య 2011లో సంచలం సృష్టించింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ' వాఫా : ఏ డెడ్లి ' సినిమాతో మంచి గుర్తింపు

Update: 2024-05-25 02:53 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్ దారుణ హత్య 2011లో సంచలం సృష్టించింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ' వాఫా : ఏ డెడ్లి ' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. రాజేష్ ఖన్నా లాంటి స్టార్స్ తో నటించి సక్సెస్ అందుకోవడంతో అవకాశాలు క్యూ కట్టాయి. చాలా బిజీ అయిపోయింది. అయితే అదే టైంలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన లైలా కనిపించకుండా పోయింది. చాలా రోజులుగా వెతికిన కన్నతండ్రి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సవతి తండ్రిపై అనుమానం ఉందని చెప్పాడు.

దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. హీరోయిన్ తో పాటు తల్లి, తన కజిన్స్ మొత్తం ఆరుగురిని కాల్చి చంపి, వారి మృతదేహాలను అదే బంగ్లాలో పూడ్చి పెట్టాడని గుర్తించారు. కాగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది నెలలకి హంతకుడు పర్వేజ్ తక్ ను అరెస్టు చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. తాజాగా తుది తీర్పు వెల్లడించింది ముంబై సెషన్స్ కోర్టు. ఆస్తి కోసమే ఇదంతా చేశాడని మరణశిక్ష విధించింది.

Similar News