నడవలేని స్థితిలో హీరో Varun Sandesh.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్‌ ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే.

Update: 2023-06-24 06:39 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్‌ ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయన కాలికి గాయమైంది. ప్రమాదం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు దీంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా ఆయన భార్య వితికా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్ సందూశ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ వరుణ్ సందేశ్ బాగున్నారు. తన అప్‌కపింగ్ మూవీ షూటింగ్‌లో కాలికి గాయమయింది. అతనికి మూడు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు. మీరంతా ఆయన మీద చూపిస్తున్న ప్రేమకు కోలుకోవాలంటూ చెప్తున్న విషెస్‌కు థాంక్యూ’’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో వరుణ్ కాలుకి పట్టి పెట్టుకుని స్టిక్‌తో అతికష్టంగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

Also Read: బయటపడ్డ స్టార్ హీరో యశ్ వివాహేతర సంబంధం.. ఇంతకూ ఆమె ఎవరు..?



Tags:    

Similar News