యాక్సిడెంట్‌లో హీరో శర్వానంద్‌కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు నిన్న అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Update: 2023-05-28 06:17 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు నిన్న అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆయన వెళ్తున్న రేంజ్ రోవర్ కారు ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. అయితే కారు బోల్తా పడటం వల్ల ఆయన గాయాలైనట్లు ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా, శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీమ్ పేర్కొంది. దీంతో అది తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News