తమ్ముడి పక్కన హీరోయిన్‌గా చెయ్యాలనేది తన కోరిక.. నటి షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ ఖుష్బు సుందర్ అందరికీ సుపరిచితమే.

Update: 2024-04-30 13:05 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ఖుష్బు సుందర్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంది. ఖుష్భు మహిళా చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అన్యాయాలు, అక్రమాలపై పలు పోస్టులు షేర్ చేస్తుంటుంది. అంతే కాకుండా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే.. బుల్లితెరపై పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. రాజకీయాలు, పర్సనల్ లైఫ్, సినీ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను దాదాపు అందరి హీరోలతో సినిమా చేశాను. కానీ బాలకృష్ణతో ఇంతవరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఇక చిరంజీవితో మూవీ చేశాను కానీ హీరోయిన్‌గా నటించలేదు. ఈ ఇద్దరి హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలనేది నా కోరిక. ఆ చాన్స్ కోసం వెయిట్ చేస్తున్న’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. ఖుష్భు మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో చిరంజీవి పక్కన అక్క క్యారెక్టర్ చేసిన ఈమె.. అతనితో హీరోయిన్‌గా నటించాలని ఉందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Read More...

పవన్ కల్యాణ్ పిలవాలే కానీ ఎక్కడికైనా వెళ్తా.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్ 

Tags:    

Similar News