ఆయన చివరి చూపు కూడా దక్కలేదు, స్కిట్ చేస్తూ పక్కకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ కామెంట్స్!

జబర్దస్థ్ ఎంతో మందికి లైఫ్‌ని ఇచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది నటీ నటులు ఫేమస్ అయ్యారు. వారిలో ఇమ్మాన్యుయేల్ ఒకడు.

Update: 2024-05-26 06:33 GMT

దిశ, సినిమా: జబర్దస్థ్ ఎంతో మందికి లైఫ్‌ని ఇచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది నటీ నటులు ఫేమస్ అయ్యారు. వారిలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కలర్ తక్కువగా, బట్ట తల ఉండటంతో తన మీద తానే పంచ్ లు వేసుకుని బాగా ఫేమస్ అయ్యాడు. ఇక వర్షతో లవ్ ట్రాక్ అతడిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు షోస్ మాత్రమే కాకుండా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు.

తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘గంగం గణేశా’ సినిమాలో ఇమ్మాన్యుయేల్ హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. మే 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. ” జబర్దస్త్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. స్కిట్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా తాత చనిపోయాడు. ఇంటికి రమ్మని.. స్కిట్ మధ్యలో వదిలేసి వెళ్ళలేను. నాకు మా తాత అంటే చాలా ఇష్టం. ఏం చేయలేని పరిస్థితి. స్టేజి వెనక్కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి కళ్ల నీళ్లు తుడుచుకొని స్కిట్ చేశాను. నా కెరీర్ బెస్ట్ స్కిట్స్ లో అది ఒకటి. ఇక స్కిట్ అయ్యాక ఇంటికి బయలుదేరాను. కానీ అప్పటికే తాత అంత్యక్రియలు అయిపోయాయి. ఆయన చివరి చూపు కూడా దక్కలేదు” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Similar News