‘మహానటి’ Keerthi Suresh మాదిరిగానే Bio- Pic కు సిద్ధమైన Krithi Sanon. ఆమె పాత్రలో జీవించేందుకు..

మహానటి సావిత్ర బయోపిక్‌తో నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్

Update: 2023-08-20 12:04 GMT

దిశ, సినిమా : మహానటి సావిత్ర బయోపిక్‌తో నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ అడుగుజాడల్లో నడుస్తోంది కృతి సనన్. ఇటీవల ‘ఆదిపురుష్’లో సీతగా మెప్పించిన ఆమె.. బాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ మీనా కుమారి పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇది కృతి ఫస్ట్ బయోపిక్ కాగా.. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా మారబోతున్నాడు. ఇక మీనాకుమారి మ్యానరిజమ్ నేర్చుకోవడానికి, ఆమె ఆన్-స్క్రీన్ వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేసేందుకు కృతి.. ఆమె క్లాసిక్ సినిమాలను చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె పర్సనల్ లైఫ్‌ను అర్థం చేసుకోవడానికి పాత ఇంటర్వ్యూలను కూడా చదువుతున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ నుంచి దీనిపై వర్క్ షాప్స్, టేబుల్ రీడ్స్ ప్రారంభం కానున్నాయని టాక్.

ఇవి కూడా చదవండి : శ్రీదేవి చిరకాల కోరిక నెరవేర్చిన బోనీ కపూర్.. ట్వీట్ వైరల్

Full View

Tags:    

Similar News