66 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన "హనుమాన్"

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్ర ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Update: 2024-03-17 06:33 GMT

దిశ, వెబ్ డెస్క్: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్ర ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం 50 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో, చిన్న నటులతో తెరకెక్కిన ఈ చిత్రం సరిగ్గా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు, సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద సినిమాలను ఎదుర్కోని భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను జీ5 వారు భారీ రేటుకు కొనుగోలు చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం దాదాపు 66 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 లో ఈ రోజు నుంచి తెలుగు వర్షన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు భారీ ఎత్తున్న నూతన సబ్‌స్క్రిప్షన్లు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Read More..

మొత్తానికి ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడ.. అంటే ?  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News